TEJA NEWS

సన్న బియ్యం పథకం విప్లవాత్మకం..
పేదల మనసు దోసుకున్న
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
పేదల కడుపు నింపేందుకే
పకడ్బందీగా అమలు..
సన్నాల సాగుకు అత్యధిక ప్రోత్సాహం..
సన్న బియ్యం పథకాన్ని పేదలంతా వినియోగించుకోవాలి..

జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్

సన్న బియ్యం లబ్ధిదారు ఇంట్లో
కలెక్టర్, ఎమ్మెల్యే భోజనం..

ఆత్మీయంగా స్వాగతం
పలికిన లబ్ధిదారుడు

దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం పథకం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం విప్లవాత్మకమని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలో మంగళవారం సన్న బియ్యం లబ్దిదారుడు కోల సంజీవ్ ఇంట్లో సన్న బియ్యంతో వండిన అన్నం కలెక్టర్, ఎమ్మెల్యే తిన్నారు. సహ పంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీతో 80 శాతానికి పైగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు


రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం పేదవాడి ఆత్మగౌరవ పథకమని తెలిపారు. దేశ చరిత్రలోనే సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలోనూ సన్న బియ్యం పంపిణీ చేయడం లేదని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ప్రభుత్వం సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నదని ప్రజలంతా ఈ సన్నబియాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం సన్న రకం వరి ధాన్యం ఎక్కువగా సాగయ్యేలా ప్రోత్సహిస్తుందని, రైతులు ఈ సాగుపై ఎక్కువగా దృష్టి సారించాలని పేర్కొన్నారు. సన్న రకం పండించిన వారికి క్వింటాలుకు 500 బోనస్ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదని, అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యమమే లక్ష్యంగా పయనిస్తున్నదని వారు తెలిపారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు అందించి తీరుతామని, పేద ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. శ్రీమంతులు తినే సన్నబియ్యాన్ని పేదలకు అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వాన్నిదని, పేదల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి వినూత్నంగా ఆలోచన చేసి సన్నబియ్యం పథకాన్ని అమలు చేయడం తో పేద ప్రజల మనసును దోచుకున్నారని పేర్కొన్నారు. సన్న బియ్యం లబ్ధిదారుడు కోల సంజీవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తమ ఇంట్లో భోజనం చేసే భాగ్యం లభించిందన్నారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రత్యేక కృషి వల్ల సాధ్యమైందన్నారు. ఇంతకుముందు ధనికులు తినే సన్నబియ్యం తమలాంటి పేదవారు తింటున్నారని తెలిపారు. ఇప్పుడు దుకాణాల్లో కొనుగోలు చేయకుండానే రేషన్ షాప్ ల ద్వారా ప్రభుత్వం సన్నబియ్యం అందించడం అభినందనీయమన్నారు.