బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో తాగునీటి సమస్యకు పరిష్కారం

TEJA NEWS

బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో తాగునీటి సమస్యకు పరిష్కారం – కొత్త బోరు మోటార్‌ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలోని 12వ బ్లాక్ నుండి 27వ బ్లాక్ వరకు ఉన్న ఎనిమిది బ్లాక్‌లలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొనడంతో ఆయా బ్లాక్‌ల కాలనీవాసులు గత వారం కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని కలిసి సమస్యను వివరించారు.వెంటనే స్పందించిన హన్మంత్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి కొత్త బోరు మోటార్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. అధికారుల సహకారంతో బోరు మోటార్ ఏర్పాటు పూర్తికాగా, ఈరోజు హన్మంత్ రెడ్డి స్వయంగా దానిని ప్రారంభించి కాలనీవాసులకు అంకితం చేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అరికెల విజయ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వీర రెడ్డి, ఎస్సీ సెల్ కన్వీనర్ సాల్మన్ రాజు, ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతగింది సురేష్, 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మన్నె కుమార్, బాలరాజు, శ్రీను, హేమలత, రజియా, కమలమ్మ, డీసీసీ జనరల్ సెక్రటరీ రమ్య, సుధారాణి, సోమరాజు తదితరులు, అలాగే పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు తమ సమస్యను వెంటనే పరిష్కరించిన కొలన్ హన్మంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.

You cannot copy content of this page

Scroll to Top