
నిరాడంబరత కు సమున్నత చిహ్నం సౌమ్య
నందిగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది
ఎమ్మెల్యే అంటే హంగు, ఆర్భాటాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఈ రోజుల్లో
నిరాడంబరంగా తనదైన శైలిలో సమతా స్థితితో ముందుకు వెళ్తూ
రాజకీయ గమనంలో ఎన్నో గ్రహణాలు దాటుకుంటూ
ఒక ధీర వనిత గా నిలిచిన ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకం
నియోజకవర్గం గా ఏర్పడిన తర్వాత శాసనసభ్యులలో మొట్ట మొదటి మహిళా శాసనసభ్యురాలిగా
గ్రామీణ ప్రాంతంగా ఉన్న నందిగామ పట్టణాన్ని తన మొదటి ఐదేళ్ల పదవి కాలంలో నవ నాగరికతను జోడిస్తూ
పంచాయతీ ని మున్సిపాలిటీ గా మార్చి
రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పూర్తి స్థాయిలో పట్టణీకరణ హంగులతో సరికొత్త అడుగులు వేస్తూ అభివృద్ధికి కృషి చేశారు
నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాలను సస్యశ్యామలంగా తీర్చిదిద్ది, రైతన్నలకు – మహిళా లోకానికి అండగా నిలిచారు
తంగిరాల ప్రభాకరరావు తనయ గా రాజకీయ ప్రవేశం చేసిన పాలనలో మచ్చలేని వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకొని మొదటిసారి ఎమ్మెల్యే గానే ప్రజల మదిలో స్థానం సంపాదించుకున్న సౌమ్య
ఓటమి తర్వాత రాజకీయ పాఠాలు, గుణపాఠాలు నేర్చుకొని – గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి, ధీర వనిత గా నిలిచారు
ఆమె పై నమ్మకంతో నందిగామ ప్రజల ప్రేమాభిమానాలతో మరలా చరిత్రలో ఎన్నడూ లేని మెజారిటీతో విజయాన్ని దక్కించుకొని చరిత్ర సృష్టించారు
గత ఐదేళ్లుగా ప్రచారంలో తప్ప అభివృద్ధి ఆమడ దూరంలో నిలిచిన నందిగామకు నూతన ఆలోచన విధానాలతో సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేశారు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
2 వ సారి ఎమ్మెల్యే గా ఏడాది పూర్తి కాకముందే కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించి, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు తంగిరాల సౌమ్య
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, అధిష్టానం దృష్టిలో ఉన్నత స్థానాన్ని దక్కించుకొని ప్రభుత్వ విప్ గా బాధ్యతలు నిర్వర్తీస్తూ, నియోజకవర్గం అభివృద్ధి – ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ
ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకొని, సమున్నత చిహ్నం గా నిలిచిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
