
కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలోఘనంగా గానగంధర్వులు ఎస్పీ బాలసుబ్రమణ్యం 80వ జయంతి వేడుకలు
వనపర్తి : వనపర్తి పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో వనపర్తి కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గాన గంధర్వులు పద్మశ్రీ , పద్మభూషణ్ స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రమణ్యం 80వ జన్మదినం సందర్భంగా వనపర్తి గాయకులు, సంగీత అభిమానులు వివిధ నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు
మాట్లాడుతూ బాలసుబ్రహ్మణ్యం సినీ పరిశ్రమలో తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ లాంటి అనేక భాషలలో 40 వేలకు పైగా పాటలు పాడి దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న గొప్ప వ్యక్తి అని అన్నారు. ఒకప్పుడు ఘంటసాల శకం ఆ తరువాత వారి సంగీత వారసులుగా ఎస్పీ బాలసుబ్రమణ్యం తెలుగువారికి ఆదర్శప్రాయుడిగా వెలుగొందారు.
ఒకప్పుడు ఘంటసాల ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు కంఠాలకు తగ్గట్టుగా ఆయన గాత్రం వినిపించి హౌరా అనిపించారు. ఘంటసాల మరణాంతరం ఆ లోటును పూడుస్తూ ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు లకే కాకుండా వారి తర్వాతి సినీ. వారసత్వంగా వెలుగొందిన సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, నటభూషణ శోభన్ బాబు ,మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ అంతేకాకుండా హాస్యనటులు అల్లూరి రామలింగయ్య లాంటి స్టార్ నటులకు వారి కంటాల నుండి పాడినట్టుగా పాడి తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. తెలుగు రాష్ట్రాల యువ కళాకారుల కోసం ఈటీవీ వారి సౌజన్యంతో టెలివిజన్ ద్వారా పాడుతా తీయగా అనే ప్రోగ్రాం నిర్వహించి అనేక మంది చిన్నారి కళాకారులను, యువ కళాకారులను వెలికి తీసి ప్రపంచానికి చాటిన గొప్ప మనసున్న వ్యక్తి అని ఈ సందర్భంగా అన్నారు.
సంగీతం అనేది మానసిక వేదనను తొలగించే దివ్య ఔషధం లాంటిదని, సర్వరోగ నివారిణి అని మనసుకు ఆనందం కలిగించే ఈ సంగీతం మనిషి ఆయుషుని కూడా పెంచుతుందని ఇలాంటి సంగీతంపై యువత దృష్టి సారించాలని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని వారు అన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలను ప్రజల సహకారంతో మరింత ముందుకు తీసుకెళ్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్, గాయకులు రవిశంకర్ , రిటైర్డ్ టీచర్, గాయకులు సత్తార్ , సీనియర్ జర్నలిస్టు మల్యాల బాలస్వామి , ఉపాధ్యాయులు గిరి రాజా చారి , సామాజికవేత్త గంధం నాగరాజు అదేవిధంగా కార్యక్రమం నిర్వాహకులు జర్నలిస్టు డి రవిప్రసాద్ , సీనియర్ గా, ప్రజా నాట్యమండలి నాయకులు నందిమల్ల రాములు, హెల్త్ అసిస్టెంట్ గంధం రాజు, ఉపాధ్యాయులు గాయకులు ఎస్ రవి ప్రసాద్ గౌడ్ , జూనియర్ గాయకులు నందిమల్ల సాంబయ్య , గంధం రవి , మల్లిపెద్ది సంజీవ్ , డి సుధాకర్ , బి మోహన్ బాబు , డిపార్ట్మెంట్ మోహన్ , బీఎస్పీ నాయకులు సూర్య , డి గట్టయ్య ఈ కార్యక్రమంలో పాల్గొని బాలసుబ్రమణ్యం జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పించారు ..