
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
పి జి ఆర్ ఎస్ “మీ కోసం”లో ప్రజల నుంచి 136 అర్జీలు స్వీకరించాం.
జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు
పల్నాడు జిల్లా :ప్రజా సమస్యల పరిష్కార వేది క’లో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆదేశించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి 136 అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలోజాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు,వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘ప్రజా సమస్యల పరి ష్కార వేదిక’లో వచ్చే ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
మండలాల్లో GSWS సర్వేలు, P4 సర్వేను పర్యవేక్షించాలి మరియు MSME సర్వే పురోగతిని కూడా పర్యవేక్షించాలితెలిపారు.
