
లలితా పీఠంలో బీజేపీ నేతల ప్రత్యేక పూజలు
చంద్రగిరి (తిరుపతి): గురు పౌర్ణమి సందర్భంగా చంద్రగిరి మండల పరిధిలోని లలితా పీఠం వ్యవస్థాపకులు శ్రీశ్రీ స్వరూపానందగిరి స్వామి వారిని భారతీయ జనతా పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు ఆహ్వానం మేరకు తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో చంద్రగిరి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. ముందుగా జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ శ్రీశ్రీ స్వరూపానంద గిరి స్వామిని శాలువాతో సన్మానించి ఆశీస్సులు పొందారు. అనంతరం పీఠంలోని అమ్మవారిని దర్శించుకుని, చంద్రగిరి నియోజకవర్గ నాయకులతో కలిసి భోజనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మురళి, హేమాద్రి నాయుడు, వేణుగోపాల్, ఓబులేష్, డి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.
