
ఎన్ ఐ టీ వరంగల్ లో స్ప్రింగ్ స్ప్రీ’25 ప్రారంభం
ఎన్ ఐ టీ వరంగల్ వార్షిక సాంస్కృతిక ఉత్సవం స్ప్రింగ్ స్ప్రీ’25 మధ్యాహ్నం సంస్థ ఆడిటోరియం లో డా. కె. బ్రహ్మానందం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి, డైరెక్టర్, ఎన్ ఐ టీ వరంగల్, ప్రొఫెసర్ డి. శ్రీనివాస చార్య, డీన్, స్టూడెంట్ వెల్ఫేర్, ప్రొఫెసర్ పి. శ్యామ్ ప్రసాద్, అధ్యక్షులు, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్, మరియు ప్రొఫెసర్ బి. శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ (సాంస్కృతిక), స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ లు హాజరయ్యారు.
అనంతరం డా. కె. బ్రహ్మానందం విద్యార్థులతో మాట్లాడారు. ఎన్ ఐ టీ వరంగల్ లో తాను పొందిన ఆదరణకు ఆనందం వ్యక్తం చేస్తూ, శ్రోతల్లో ఉన్న ప్రతిభాశాలి విద్యార్థులలో భవిష్యత్తులో కలామ్స్ మరియు బ్రహ్మానందం లు ఉండబోతున్నారని తెలిపారు.
అలాగే, విద్యార్థులు ఆరోగ్యాన్ని ప్రధానంగా పరిగణించాలన్న ప్రాముఖ్యతను వివరించారు. ఆరోగ్య కరమైన ఆలోచనలు ఉన్న మనిషి మంచి పనులు చేయగలడని పేర్కొన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను నిరంతరం అనుసరించి, దృఢ సంకల్పం మరియు కష్టపడి పనిచేస్తే విజయాన్ని తప్పక సాధించ గలరని ఆయన సూచించారు. చివరగా, “మంచి చేద్దాం, మంచిగా జీవిద్దాం, ఆనందంగా ఉండండి” అని సందేశం ఇచ్చారు.
సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శించేందుకు స్ప్రింగ్ స్ప్రీ’25 వేదికగా నిలుస్తుంది. దేశం నలుమూలల నుండి విద్యార్థులు పాల్గొని సంగీతం, నృత్యం, నాటకం, మరియు ఇతర సాంస్కృతిక పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.
ఎన్ ఐ టీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి స్ప్రింగ్ స్ప్రీ’25 ఉత్సవానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ, ఈ ప్రతిష్టాత్మక సాంస్కృతిక ఉత్సవాన్ని అద్భుతమైన ప్రారంభం తో ఆరంభించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
విద్యార్థుల సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ, వారిలో ఉన్న ప్రతిభను ప్రదర్శించే గొప్ప వేదికగా స్ప్రింగ్ స్ప్రీ’25 నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అదేవిధంగా, విద్యార్థులు ఈ వేడుకలో తమ విశేష ప్రతిభను ప్రదర్శించి, ఎన్ ఐ టీ వరంగల్ ఖ్యాతిని మరింత పెంచాలని ఆకాంక్షించారు.
రేపటి ముఖ్యమైన ఈవెంట్స్
ఈ ఉత్సవం సంగీతం, నృత్యం, నాటకం, ఫొటో గ్రఫీ, కళలు, మేధో పరీక్షలు, మరియు అనేక ఇతర సాంస్కృతిక పోటీలకు వేదికగా నిలుస్తుంది.
• డాన్స్ రష్: ఉత్సాహ భరిత నృత్య పోటీ. సంగీతం ఆడినప్పుడు పాల్గొనేవారు డాన్స్ చేయాలి, పాట ఆగిన వెంటనే నిలబడాలి. ఆలస్యమైన వారు ఎలిమినేట్ అవుతారు.
• తానాబానా: జట్లుగా పాల్గొనే ఈ పోటీలో సంస్కృతి, సాంప్ర దాయాలు, ఆహారం, వస్త్ర ధారణ పై అవగాహన పరీక్షించ బడుతుంది. అత్యధిక పాయింట్లు సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది.
• ట్రెజర్ హంట్: సంస్కృతం ఆధారిత బహుమల వేట, 2-3 మంది సభ్యులతో కూడిన బృందాలు సాహస యాత్రగా ఈ హంట్‌లో పాల్గొంటాయి.
• అన్ సాల్వ్డ్: మర్డర్ మిస్టరీ పోటీ, మిమ్మల్ని గూఢచారులుగా మార్చే అనుభవం. హంతకుడిని గుర్తించడానికి క్లూస్ డీకోడ్ చేయాలి.
• సోలో ఐడల్: సంగీత ప్రియుల కోసం ప్రఖ్యాత గానం పోటీ. హిందుస్తానీ, కర్ణాటక, పాశ్చాత్య సంగీతంతో పాటు ర్యాప్, ఫోక్ పాటలతో పాల్గొనవచ్చు.
• సోలో ఇన్‌స్ట్రుమెంటల్స్: సంగీత వాయిద్య కచేరీలకు ప్రత్యేకంగా రూపొందించిన పోటీ. రాగాలు, జాజ్, రాక్ సోలోస్, బ్లూస్ తదితర శైలులలో కళాకారులు ప్రదర్శన ఇస్తారు.
• స్ట్రీట్ ఫొటోగ్రఫీ పోటీ: పాల్గొనేవారు 15 నిమిషాల్లో బహిరంగ ప్రదేశాల్లో అత్యుత్తమ ఫొటోలు తీయాలి. అద్భుతమైన ఫొటోలు “ఫ్రేమ్ ఆఫ్ ఫేమ్” లో ప్రదర్శించ బడతాయి.
• పోలరాయిడ్ ఫొటోగ్రఫీ: తక్షణ ఫొటో అనుభవం. పాల్గొనేవారు పోల రయిడ్ ఫొటోలను పొందే అవకాశాన్ని పొందుతారు.
• ఆర్ట్ థెరపీ: చిత్రలేఖనం, డూడ్లింగ్, పెయింటింగ్ ద్వారా వ్యక్తీకరణను ప్రోత్సహించే కార్య క్రమలు ఉంటాయని తెలిపారు.
