
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి లో గల ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం నవహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన పూజా కార్యక్రమాలలో ముఖ్యఅతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . ఈ సందర్భంగా దేవస్థానం పూజారులు వేద ఆశీర్వచనం అందించారు. స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. దేవాలయం అభివృద్ధికి ఎల్లప్పుడు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు విజయ భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాపరెడ్డి, ఆలయ ఈవో శశిధర్, షేక్ హుస్సేన్, స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు.
