
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనలో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….
132 – జీడిమెట్ల డివిజన్ శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విశ్వకర్మ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన ఆలయ తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలకు బిఆర్ఎస్ పార్టీ, విప్ కెపి.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….తాత్కాలికమైన దేహం కోసం శాశ్వతమైన ఆత్మ కోసం జీవించాలని ప్రపంచానికి చాటిన మహా యోగి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, కాలే నాగేష్, నరేందర్ రెడ్డి,సమ్మయ్య నేత, ఎల్లా గౌడ్, కాలే గణేష్, నదీమ్ రాయ్, మోహన్ రెడ్డి, బాల మల్లేష్, విజయ్ హరీష్, సత్యనారాయణ యాదవ్, ఆలయ చైర్మన్ అన్నోజు భానురి కృష్ణమాచారి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
