
“శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే” 199వ జయంతి
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లి రాజీవ గాంధీ నగర్ లో శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ యాదవ్ , ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కోర్పిరేటర్ సుజాత. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే” జీవితం బహుజనుల స్ఫూర్తిదాయకం స్త్రీల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు, వితంతు పునర్వివాహాలు, సమాజంలోని కుల జాడ్యాన్ని రూపుమాపేందుకు ‘సత్యశోధన సమాజ్’ స్థాపన మరియు బ్రాహ్మణ వాదం నశించాలి బహుజన వాదం వర్ధిల్లాలి అనే వంటివి పూలే కృషికి ప్రతీకలు .ఈ కార్యక్రమంలో ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగ అధ్యక్షులు ప్రవీణ్, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు చెన్న కేశవ ,సూరి, అరవింద్, వర్ధన్, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు
