
ధర్మ సంస్థాపనార్థం శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఎనిమిదవది శ్రీకృష్ణ అవతారం, మనకు మార్గదర్శి శ్రీకృష్ణ పరమాత్ముడు.
మంచిని కాపాడటానికి, చెడును అంతమొందించటానికి శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించారు.
ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య ..
చందర్లపాడు మండలం : పాత బెల్లంకొండ వారి పాలెం గ్రామం నందు గురువారం నాడు శ్రీకృష్ణుని విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి మరియు కూటమినేతలతో కలిసి పాల్గొన్న ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య మాట్లాడుతూ. దైవమై రక్షిస్తూ, గురువులా నేర్పిస్తూ, స్నేహితుడై వెన్నంటి నిలుస్తున్న నందగోపాలుని ఆశీస్సులతో ప్రజలంతా ఆనందమయ జీవితం గడపాలని ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలి. గీతాసారంతో జీవితసారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తుచేసుకుని ముందుకు సాగడమే. ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీ కృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చు.కృపా, కటాక్షం రాష్ట్రంపై సదా ఉండాలని వేడుకుంటున్నట్లు తెలియజేశారు.
