
శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
132 – జీడిమెట్ల డివిజన్ జీడిమెట్ల గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం కమిటీ సభ్యులు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాద పూర్వకంగా కలిసి ఈనెల 27వ నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే ని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా రూపొందించిన బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరింప చేశారు.
ఈ కార్యక్రమంలో గొరిగే బాలప్ప, ఎల్లప్ప, జీతయ్య, వెంకటేష్, ఆంజనేయులు గొరిగే బాల మల్లేష్, కాలే నగేష్, కోట బాల మల్లేష్, కాలే గణేష్ తదితరులు పాల్గొన్నారు.
