TEJA NEWS

శ్రీ శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీ విరాట్ విశ్వకర్మ శివాలయ తృతీయ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 డివిజన్ జీడిమెట్ల పరిధిలోని వెన్నెల గడ్డ లో శ్రీ శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీ విరాట్ విశ్వకర్మ శివాలయ తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి పాల్గొని స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడు సుఖ: సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు . ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు
ఆలయ కమిటీ చైర్మన్ బి. కృష్ణమ చారీ, అధ్యక్షులు కె.శేఖర్,జనరల్ సెక్రటరీ కే. సంతోష్ చారీ, జయగోపాల్ చారీ, జె. శ్రీనివాస్ చారీ,బి. శ్రీనివాస్ చారీ, బి. బాల్ చారీ, డీసీసీ ఉపాధ్యక్షులు ధమ్మని శ్రవణ్ కుమార్, డివిజన్ నాయకులు బేకు శ్రీనివాస్, సోమన్నగారి శ్రీధర్ రెడ్డి, సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, రాజు చారి మరియు తదితరులు పాల్గొన్నారు.