Spread the love

శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ 286వ జయంతి ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ….

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని కల్లెడ గ్రామం నందు పర్వతగిరి మండల ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ 286వ జయంతి ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ….

తొలుత బంజారా సోదర సోదరమణులకు ఆచార శాలువా పూల్యగల తో ఎమ్మెల్యే నాగరాజు ని సత్కరించారు….

అనంతరం బంజారా సోదర, సోదరమణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు…

ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతు:-…

బంజారా సోదరుల కోరిక మేరకు వారికి మండల కేంద్రంలో

శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారాల ఆరాధ్య దైవం. అతను హిందూధర్మం గొప్పతనం బంజారాలకు తెలియజేయడానికి జన్మించిన మహానుభావునిగా భావిస్తారు….

ఈ సమస్త జీవకోటికి మాతృరూపం (తల్లిగా) వెలిసిన అమ్మభవాని గురించి అమ్మను పూజించాలని, కాని ఫలితం ఆశించవద్దని బంజారా లకు బోధించారు…

సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ , హింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్తు ఇతర కులాలకు ఆదర్శపురుసుడయ్యారు…

సేవాలాల్‌ మహరాజ్‌ ఆనాడు బంజారా జాతి పరువు ప్రతిష్టల గురించి ముందుగానే ఊహించి అహింస సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించి చూపారు.

ఆ తరుణంలో బంజారాలు ఆనాడు రాజుల కాలం నుంచి బ్రిటిష్‌ కాలం వరకు ఆయా రాజ్యాలకు అవసరమైన యుద్ధ సామాగ్రిని చేరవేస్తూ సంచార జీవనం సాగిస్తూ ఉండేవారు.

ఆ క్రమంలో బ్రిటిష్‌, ముస్లీం పాలకుల మత ప్రచారం ద్వారా బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురి అయ్యింది.

ఈ పరిస్థితులలో బంజారా జాతిని సన్మర్గంలో నడిపించేంందుకు సేవాలాల్‌ మహారాజ్‌ అవతరించారు.

సేవాలాల్‌ మహరాజ్‌ బోధనల ద్వారా బంజారా జాతి పురోగమిస్తుంది…

ప్రతీ లంబాడీ, గిరిజన బిడ్డ కూడా సేవాలాల్ బోధనలు ఆచరిస్తూ మహోన్నతమైన స్థానాన్ని చేరాలని ఈ సందర్బంగా వారు ఆకాంక్షించారు…

ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బంజారా అధ్యక్షుడు బాబూసింగ్ చౌన్ మహరాజ్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్రావు, మండలాధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్ నాయక్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగొని ప్రభాకర్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ గొర్రె దేవేందర్, ప్రజాప్రతిని మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు