
అంగరంగ వైభవంగా ముగిసిన శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజులు స్వామి జాతర మహోత్సవం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వేదాంతపురం గ్రామంలో ఆదివాసుల ఆరాధ్య ధైవం, ఆదివాసి గిరిజన నాయకపోడు తెగ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతర మహోత్సవం శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజుల స్వామి జాతర మొహత్సవం శుక్రవారంతో ముగిసింది. ఐదు రోజుల పాటు నిర్వహించే జాతరలో భక్తిశ్రద్ధలతో ఆదివాసిలతో పాటు ఇతరులు కూడా మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ప్రారంభం అయినా జాతర మహోత్సవం శుక్రవారంతో ముగిసింది. ఆదివారం గ్రామంలో ఊరేగింపుగా బయలుదేరి గ్రామంలో ప్రతి ఇంటిలోనికి ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించుకొని సోమవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆలయంలోకి చిన్న కొర్రాజులు స్వామి వారు ప్రవేశించారు. తర్వాత ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారికి సేవా కార్యక్రమం జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, గణాచారుల నృత్యాలు నిలిచాయి. చంద్రపట్నం, సూర్య పట్నం, కొల బియ్యం కార్యక్రమం సరువులు కార్యక్రమం అగ్నిగుండం ఏర్పాటు చేసి నిప్పుల గుండాల్లో భక్తి శ్రద్దలతో నడిచారు. అదేవిధంగా ఒరతాడు దెబ్బలు (త్రాడు తో కొట్టడం) కోసం భక్తులు ఆసక్తి కనబరిచారు. ఈ జాతర మహోత్సవం కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వహకులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు,
