
వైభవంగా జరిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు
నగరోత్సవంలో పాల్గొన్న ప్రత్తిపాటి
చిలకలూరిపేట పట్టణంలోని, వాసవి ధర్మసంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న అమ్మవారి నగరోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరి సదాశివరావు, షేక్ టీడీపీ కరీముల్లా, పఠాన్ సమద్ ఖాన్, గుర్రం సాంబశివరావు, కొత్త కోటేశ్వరరావు, అమరా రమాదేవి, ప్రమీల, కొత్త కుమారి, తదితరులు పాల్గొన్నారు.
