TEJA NEWS

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టీఎన్జీవో కాలనీ లో గల శ్రీ భూ నీళా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండలని, స్వామి వారి కృపా ప్రజలందరి పై ఉంటుంది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మంత్రి ప్రగడ సత్యనారాయణ,టీఎన్జీవో కాలనీ వాసులు సుధాకర్, కారెం రవీందర్ రెడ్డి, విఠల్, కృష్ణ రెడ్డి, హన్మ నాయక్, కృష్ణ మోహన్, సంజీవయ్య మరియు భక్తులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.