
స్టార్ చిల్ద్రెన్ హై స్కూల్, పాల్వంచ
స్టార్ చిల్డ్రన్ స్కూల్ లో
ఘనంగా మాతృభాషా దినోత్సవం వేడుకలు
కమ్మనైన అమ్మ భాష మాతృభాష … గౌరవ సలహాదారులు, పి పుష్పలత
ఇంగ్లీషు భాష మోజులో పడి మాతృభాషను మరవద్దు … తెలుగు అధ్యాపకులు శ్రీమతి ఝాన్సీ , శ్రీమతి మహేశ్వరి పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మార్కెట్ ఏరియాలో గల స్టార్ చిల్డ్రన్ హైస్కూల్ లో శుక్రవారం నాడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల గౌరవ సలహాదారులు శ్రీమతి పి. పుష్పలత మాట్లాడుతూ కమ్మనైన అమ్మ భాషే మాతృ భాష అని, అమ్మ భాషలోని మాధుర్యాన్ని మరి ఏ ఇతర భాషలలో పొందలేమని,కనుక అమ్మను అమ్మ భాషను అందరూ కాపాడుకోవాలని తెలియజేసినారు.
అనంతరం తెలుగు అధ్యాపకులు శ్రీమతి ఝాన్సీ, శ్రీమతి మహేశ్వరి మాట్లాడుతూ భూమిపై ఉన్న సమస్త జీవరాసులలో ఒక్క మానవుడు మాత్రమే తన హవ భావాలను మాటల రూపంలో వ్యక్తీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇతర భాషలను నేర్చుకోవడం తప్పుకాదని వాటి ప్రభావం మాతృభాష పై పడకుండా చూసు కోవటం మనందరి కర్తవ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి తెలుగు అధ్యాపకులను ఘనంగా సన్మానించినారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జి భాస్కరరావు ప్రిన్సిపాల్ జి శ్రీనివాస్ రెడ్డి అధ్యాపకులు రమాదేవి,స్వరూప రాణి,గీత, ప్రశాంతి, స్వాతి, శ్వేత, లక్ష్మి, సుల్తానా మరియు విద్యార్థులు పాల్గొన్నారు. జి. భాస్కరరావు కరస్పాండెంట్
స్టార్ చిల్డ్రన్ హై స్కూల్, పాల్వంచ
9866806532
