
విద్యార్థుల కోసం నూతన బస్సు సర్వీస్ ప్రారంభం
జిన్నారం మండలంలోని విద్యార్థినీ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని జిన్నారం నుండి సికింద్రాబాద్ వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కోసం జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ ప్రత్యేక చొరవతో జీడిమెట్ల డిపో మేనేజర్ తో మాట్లాడి ఉదయం 7 గంటలకు జిన్నారం నుండి సికింద్రాబాద్ వెళ్లే బస్సు రూట్ ను ప్రారంభించడం జరిగింది. నూతన బస్సును జిన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొబ్బరికాయలు కొట్టి బస్సు సర్వీసును ప్రారంభించడం జరిగింది. జిన్నారం నుండి హైదరాబాద్ కు వెళ్లే విద్యార్థులకు ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఉదయం పూట ఈ బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు ప్రజలు మహిళలు ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రవీందర్ గౌడ్ తెలిపారు. ఈ బస్సు సర్వీస్ తో ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు మహిళలకు మరింత సౌకర్యంగా ప్రయాణం చేయడానికి వీలు కల్పించినందుకు జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు జిన్నారం కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.
అలాగే ఈరోజు నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెబుతూ పరీక్షల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ మంచి ఉత్తీర్ణులతో పాస్ కావాలని మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింలు కోరబోయిన నరేష్ యనగండ్ల నరేందర్ పల్నాటి భాస్కర్ గోకర వెంకటేష్ పుట్టి భాస్కర్ ఎరవలి ప్రవీణ్ విష్ణుమూర్తి రొయ్యపల్లి రవి. సంజీవ. నాగారం యాదగిరి. బాలు కోరబోయిన నర్సింలు యాదయ్య పాపయ్య మహేష్ సాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
