
మార్చి 2న జరిగే రాష్ట్ర ముఖ్యమంత్రి వనపర్తి జిల్లా పర్యటనను విజవంతం చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి
నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి తో కలిసి స్థల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి
మార్చి 2న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల పై నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘారెడ్డి, డిఎస్పీ వేంకటేశ్వర రావు, ఇతర జిల్లా అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు.
కే.డి.ఆర్ పాలిటెక్నిక్ కళాశాల వెనక భాగంలో హెలిప్యాడ్ ఏర్పాట్లు, ముందు భాగంలో నిర్వహించనున్న ప్రజాపాలన – ప్రగతి బాట బహిరంగ సభకు చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు.
అదేవిధంగా ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో నిర్వహించనున్న వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు ఎలాంటి ఏర్పాటు చేయాలి అనే విషయాలపై పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులతో చర్చించారు.
వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వారి చేతుల మీదుగా జరిగే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, జాబ్ మేళా, నైపుణ్య శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పకడ్బందీగా ప్రణాళికలు చేసుకోవాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి
కలక్టర్ ను సూచించారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు , ఇటీవల వనపర్తి జిల్లా నుండి బదిలీ పై వెళ్లిన అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, ప్రస్తుత ఇన్చార్జి యాదయ్య, రోడ్లు భావనాల కార్యనిర్వహక ఇంజనీరు దేశ్యా నాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, డిఎస్పీ వేంకటేశ్వర రావు, సి. ఐ, ఎస్సై లు తదితరులు పాల్గొన్నారు.
