TEJA NEWS

రోడ్డు ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క

నిన్న రాత్రి మేడారం వన దేవతలను దర్శించుకొని తిరిగి వస్తుండగా ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఇసుక లారీ ఢీకొనగా ఇద్దరు మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ ధనసూయ సీతక్క
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులను అప్రమత్తం చేసి ప్రమాదం గల కారణాలను అడిగి తెలుసుకున్నారు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి సంతాపం వ్యక్తం చేస్తూ
పోలీస్ అధికారులు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధిక వేగం తో వెళ్తున్న వాహనాలను నియంత్రించి ప్రమాదాలను అరికట్టాలని సూచించారు
గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి పై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు