TEJA NEWS

రాష్ట్ర టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీ సొంటి రెడ్డి పున్నారెడ్డి పెహల్గాం దుర్ఘటన లో మరణించినటువంటి అమరవీరులకు కొవ్వొత్తులను వెలిగించి సంతాపం ప్రకటించారు. వారి యొక్క మరణం దేశానికి తీరని లోటు అని తన సానుభూతిని తెలియజేశారు.
దేశంలో రక్షణ, శాంతిభద్రతలు కాపాడుకోవడం మనందరి వంతు అని ,ఐక్యమత్యంతో కలిసి ఉండటం మన బాధ్యత అని చాటిచెప్పారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు రషీద్ బేగ్ ,లాల్ మహమ్మద్, 125 డివిజన్ అధ్యక్షులు లాయక్ . దండే రాజు, మరలింగ, అన్వర్, మహేష్ గౌడ్, హర్భజన్ సింగ్ ,గఫర్ ,మోహిన్ . రజాక్, రామిరెడ్డి మరియు చంద్రగిరి నగర్ శ్రీనివాస్ నగర్ ప్రజలు , పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.