వేసవి శిబిరాల్లో బాలల మేధో వికాసానికి కథలు పునాది

TEJA NEWS

వేసవి శిబిరాల్లో బాలల మేధో వికాసానికి కథలు పునాది

‘బాల సాహిత్యపు బుచ్చిబాబు’
ఎడ్లపాడు:బాసట సామాజిక సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఎడ్లపాడు, లింగారావుపాలెం గ్రామాలలో గత 15 రోజులుగా జరుగుతున్న వేసవి శిక్షణ శిబిరాలు ఎంతో ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన ‘కథలు చెప్పడం–రాయించడం’ కార్యక్రమానికి ప్రముఖ బాలసాహిత్యవేత్త, ‘బాల సాహిత్యపు బుచ్చిబాబు’ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు కథల రచనలోని మెలకువలను నేర్పించారు. బాలల మేధో వికాసానికి కథలు పునాది లాంటివని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బాసట కమిటీ సభ్యులు బొచ్చు రాజేష్.. దార్ల బుచ్చిబాబును శాలువాతో సత్కరించి, మెమొంటో బహుకరించారు. కార్యక్రమంలో బాసట కమిటీ అధ్యక్షులు నూతలపాటి కాళిదాసు, విద్యా కమిటీ కన్వీనర్ కల్లూరి వాసు, కమిటీ సభ్యులు చెరుకూరి సృజన, చెన్నుపాటి హనుమంతరావు, ముత్తవరపు విజయ్, రవీంద్ర, కేత రామబ్రహ్మం, నంబూరి శివరామకృష్ణ, కోయ రామోజీ, రావూరి సురేష్, తోకల మధు మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top