Spread the love

వెల్టూర్ ఉన్ని పారిశ్రామిక సహకార సంఘాన్ని బలోపేతం చేసుకుందాం………………….మ్మెల్యే మేఘా రెడ్డి_

వనపర్తి
_ వనపర్తి నియోజకవర్గం లోని
పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలోని ఉన్ని పారిశ్రామిక సహకార సంఘాన్ని పూర్తిస్థాయిలో బలోపేతం చేసుకుందామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు_

ఆయన వెల్టూర్ చేనేత కాలనీలోని ఉన్ని పారిశ్రామిక సహకార సంఘాన్ని సందర్శించారు

ఈ సందర్భంగా సంఘ భవనంలో రగ్గులను తయారుచేస్తున్న చేనేత కార్మికులతో ఎమ్మెల్యే మాట్లాడారు

ఈ పారిశ్రామిక సహకార సంఘంలో తయారైన రగ్గులకు తుది మెరుగులు ఇక్కడ ఇవ్వలేకపోతున్నామని దానికోసం హర్యానా వెళ్లవలసి వస్తుందని సంఘం చైర్మన్ వెంకటేష్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు

అందుకు సనుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఫినిషింగ్ యూనిట్ ఏర్పాటు కోసం నివేదికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి యూనిట్ మంజూరి కోసం ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నారు

కార్మికుల యోగక్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు
కార్యక్రమంలో డి సి సి బి జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు