Spread the love

బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన విద్యార్థి సంఘాలు

సాక్షిత వనపర్తి మార్చి 22
యువతను బెట్టింగ్ కి ఆకర్షితులను చేస్తూ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా యువజన కాంగ్రెస్, (NSUI) మరియు (టీజీవీపీ) విద్యార్థి నాయకులు వనపర్తి జిల్లా (SP) ఎస్పీ రావుల గిరిధర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థుల నాయకులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో జిల్లాలో యువత పెద్ద ఎత్తున ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బెట్టింగ్ కి ఆకర్షితమవుతున్నారు. ఈ బెట్టింగ్ కారణంగా యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. చదువును నిర్లక్ష్యం చేయడం అప్పుల్లో కూరుకుపోవడం కుటుంబాలపై భారం వేయడం వంటి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి
ఈ బెట్టింగ్ ప్రభావంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. కొంతమంది ముట్టాలు యువతను ప్రోత్సహిస్తూ వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భారీగా లాభాలు పొందుతున్నట్లు సమాచారం
కాబట్టి ఈ బెట్టింగ్ను నియంత్రించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని . పోలీసు విభాగం ప్రత్యేక దృష్టి సారించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బెట్టింగ్ నిర్వాహకులపై కఠిన చర్యలుటే యువతను రక్షించ వచ్చని అన్నారు ఈ అంశంపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు కోరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు దివాకర్ యాదవ్ మహేష్ అశోక్ చింటూ NSUI నాయకులు జిల్లా అధ్యక్షుడు రోహిత్ తెలంగాణ విద్యార్థి పరిషత్ (TGVP)జిల్లా అధ్యక్షుడు వంశీ యాదవ్ నగర అధ్యక్షుడు శివ తదితరులు పాల్గొన్నారు