
పంచాయతీలో అవినీతిని గుర్తించి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి వైసీపీ నాయకులు
ఆకాశ రామన్న పేరుతో ఉత్తరాలు
ప్రశాంతమ్మ అవినీతి రహిత కోవురు ను చూడాలన్నారు అవినీతికి పాలు పడిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి
కోవూరు వైసిపి పార్టీ కార్యాలయంలో వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా వైసీపీ జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ అధ్యక్షులు, కోవూరు మండల అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి మాట్లాడుతూ ఆకాశ రామన్న ఉత్తరాలతో కోవూరు పంచాయతీ పిఓపిఆర్డి ,ఈవో అక్రమాలకు పాల్పడుతున్నారు ఇద్దరు కలిసి ఒకటి గాఏర్పడి ఫోర్జరీ సంతకాలతో, చాలా అవినీతికి పాల్పడుతున్నారని ఎన్ని ఆరోపణలు ఉన్నా అధికారులు ఎందుకు వారి మీద చర్యలు తీసుకోవడం లేదు అలాగే కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మీరు అవినీతి రహిత కోవూరు చూడాలన్నారు దీని మీద మీరు విచారణ జరిపి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మా వైసీపీ నాయకుల తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే వారు కింద స్థాయి ఉద్యోగులను చాలా ఇబ్బంది పెడుతున్నారు పశువుల సంత పెట్టడం పంచాయతీలో వార్డు సభ్యులకు తెలియకుండానే పలు కార్యక్రమాలు చేస్తున్నారు గ్రామ సభ పెడితే కోవూరు ప్రజలకు కూడా తెలియదు. ఎవరైనా ప్రశ్నిస్తే ప్రతి ఆఫీసులో మా మనుషులు ఉన్నారని మాకు ఏమీ భయం లేదని చెప్తారు. దీని మీద ప్రముఖ పత్రిక లో కూడా కథనాలు వచ్చాయి. దీనిపైన అధికారులు విచారణ జరిపి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. మాజీ జిల్లా వ్యవసాయ సలహా మండల అధ్యక్షులు దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి , మండల అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, జడ్పిటిసి సభ్యులు కవరగిరి శీలత , మండల పరిషత్ ఉపాధ్యక్షులు శివుని నరసింహారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు శ్రీ తలపల వేణు, వార్డు సభ్యులు శ్రీనివాసులు ,సుప్రజ, రేణుకమ్మ, కళ్యాణి, నాగలక్ష్మి , సుశీల , వజ్రమ్మ కవర గిరి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు*
