Spread the love

పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం …

ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కఠిన చర్యలు..

రాష్ట్ర,జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులలో నిరంతర పర్యవేక్షణ

లింగాల క్రాస్ రోడ్డు చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. కామేపల్లి మండలం లింగాల క్రాస్ రోడ్డు చెక్ పోస్ట్ ను పోలీస్ కమిషనర్ శనివారం సందర్శించి తనిఖీ చేశారు.

నిబంధనలు విరుద్ధంగా జరిగే ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంచాలన్నారు. వాగులు, నది పరివాహక ఇసుక తవ్వకాల ప్రాంతాలను గుర్తించి నిఘా పెంచాలని సూచించారు. ఇసుక అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా వెంటనే చట్ట ప్రకారం జరిమానాలు విధించడం, కేసులు నమోదు చేయడం, వాహనాలను జప్తు చేయాలన్నారు. అధికారుల సమన్వయంతో ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం నిఘా పెట్టి పూర్తిస్థాయిలో నిర్మూలించాలని సూచించారు. జీరో బిల్లులు, డబుల్ ట్రిప్, అదనపు లోడ్, నకిలీ బిల్లులు, తప్పుడు వాహనంలో రవాణా, తప్పుడు గమ్యం స్దానం, అలాంటి ఉల్లంఘన మరియు అక్రమాలపై కేసులు నమోదు చేయాలని అన్నారు…