Spread the love

విజయవంతమైన
సుంకిరెడ్డి మెగా జాబ్ మేళా…

నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం…

 ఐక్యత ఫౌండేషన్ చైర్మన్&

టాస్క్ సి ఓ ఓ
సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి,

జాబ్ మేళాలో పాల్గొన్న
వివిధ రంగాలకు చెందిన
68 రకాల కంపెనీలు..

•జాబ్ మేళాకి 2500 మందికి పైగా నిరుద్యోగ యువత హాజరవ్వగా…
ఉద్యోగాలకు ఎంపికైన
230 మంది అభ్యర్థులకు తక్షణమే ఆఫర్ లెటర్స్ అందజేత…
నాగర్ కర్నూల్ జిల్లా సాక్షిత ప్రతినిధి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని సి కె ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సుంకిరెడ్డి మెగా జాబ్ మేళా విజయవంతమైంది..
ఈ సందర్భంగా
సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ…


నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పనే ధ్యేయంగా ముందుకువెళ్తున్నామని, నియోజకవర్గంలో దాదాపు పదివేల మందికిపైగా యువతకు ఉద్యోగాల అవకాశాలు అందించేందుకు ప్రతిదినం పని చేస్తున్నామని, ఈరోజు జాబ్ మేళాలో 2500 మందికిపైగా నిరుద్యోగులు పాల్గొనగా వారికి వివిధ రంగాలకు చెందిన 68 రకాల కంపెనీల ప్రతినిధులు పాల్గొనడం జరిగిందని, ఈరోజు జరిగిన జాబ్ మేళ కార్యక్రమంలో భాగంగా దాదాపు 230 మందికి పైగా అభ్యర్థులకు తక్షణమే ఆఫర్ లెటర్స్ అందించడం జరిగిందని, మన కల్వకుర్తి ప్రాంత యువతకోసమై ప్రతి సంవత్సరం కూడా సుంకిరెడ్డి మెగా జాబ్ మేళా కార్యక్రమం కొనసాగుతుందని తెలియజేస్తూ, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులందరికి ప్రత్యేకంగా శుభాకంక్షలు తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో…
ఐక్యత ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు కృష్ణారెడ్డి సుభాషిణి మరియు
ఐక్యత ఫౌండేషన్ సభ్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు.