
నాలుగురోజులుగా విజయవంతంగా కొనసాగుతున్న సుంకిరెడ్డి ఉచిత కంటి వైద్య శిభిరం సేవలు…
ప్రారంభమైన కంటి శుక్లాల సర్జరీల ప్రక్రియ.._
“28”మంది పేషెంట్లకు విజయవంతంగా కంటి శుక్లాల సర్జరీలు పూర్తి,
- నాల్గవ రోజు
800 మంది కంటి శిబిరాన్ని సందర్శించగా, - 550పైగా కంటి పరీక్షలు నిర్వహణ,
- 350 పైగా ఉచిత కంటి అద్దాల పంపిణి,
- 30 మంది పేషెంట్లు కంటి శుక్లాల సర్జరీకి ఎంపిక,
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని సి కె ఆర్, ఫంక్షన్ హాల్ నందు
ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు&
టాస్క్ సి ఓ ఓ,సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో శంకర నేత్రాలయ వారిచే ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిభిరం సేవలు నాల్గు రోజులుగా విజయవంతంగా కొనసాగుతున్నాయి..
ఈరోజు శిబిరాన్ని సందర్శించిన సుంకిరెడ్డి మాట్లాడుతూ,
మనిషి శరీరంలో కళ్ళు చాలా ముఖ్యమైన అంశం అని, వాటిని నిర్లక్ష్యం చేయొద్దని,ఎలాంటి కంటి సమస్య ఉన్న పరిష్కారం చూపెదిశగా కంటి వైద్య శిభిరం సేవలు కొనసాగుతున్నాయని,
గత నాలుగు రోజుల నుండి దాదాపు 3000 మందికి పైగా కంటి శిబిరాన్ని సందర్శిచారని,2200 మందికి కంటి పరీక్షలు నిర్వహించండం జరిగిందని,వీరిలో 120 మందికి పైగా పేషెంట్లను కంటి శుక్లాల ఆపరేషన్లు ఎంపిక చేయడం జరిగిందని,వీరితో పాటు దాదాపు 1300 మందికిపైగా ఉచితంగాకంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగిందని,ఆదివారం వరకు కొనసాగనున్న ఉచిత కంటి శిభిరం సేవలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది,ఈ కార్యక్రమంలో…
ఐక్యత ఫౌండేషన్ సభ్యులు నరేందర్ గౌడ్,యూసఫ్ బాబా,గణేష్, యాదయ్య,రమేష్ నాయక్,శేఖర్,రాఘవేందర్,శ్రీపతి,శ్రీను,నాగిళ్ల శివ,కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
