
పల్నాడు జిల్లా నందు హోటల్స్, లాడ్జి ల నందు పోలీసుల ఆకస్మిక తనిఖీలు
పల్నాడు జిల్లా నందు శాంతి భద్రతలను పరిరక్షించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా, పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు, ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు, వివిధ హోటల్స్, లాడ్జిలలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలలో అనుమానితుల వివరాలను సేకరించడం, హోటల్స్ మరియు లాడ్జీ ల
లాగ్ బుక్స్ ను పరిశీలించడం, గుర్తింపు పత్రాల నమోదు విధానం తదితర అంశాలపై ఖచ్చితమైన తనిఖీలు చేపట్టారు.
గైడ్‌లైన్స్ ప్రకారం నడవాలని లాడ్జి యాజమాన్యాలకు స్పష్టమైన సూచనలు చేయబడ్డాయి.
మహిళల భద్రత, శాంతి స్థాపన, మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎస్పీ ఎస్పీ తెలిపారు.
పరారీలో ఉన్న నిందితులు, అనుమానితులు, చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచేందుకు ఈ తనిఖీలు జరుగుతున్నాయని ఆయన వివరించారు.
భవిష్యత్తులో ఇలాంటి తనిఖీలను మరింత కఠినంగా కొనసాగించనున్నామని, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
జిల్లా పోలీస్ కార్యాలయం,
నరసరావు పేట.
