
100 పడకల ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ప్రత్తిపాటి
- రోగులతో మాట్లాడి వైద్యసేవలపై అభిప్రాయాలు తెలుసుకున్న మాజీమంత్రి
చిలకలూరిపేట :స్థానిక 100 పడకల ఆసుపత్రిని మాజీమంత్రి ప్రత్తిపాటి ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు, ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులపై ఆసుపత్రి వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. రోగులతో మాట్లాడి వైద్యులు, సిబ్బంది పనితీరుపై అభిప్రాయాలు తెలుసుకున్న ఆయన, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యసిబ్బందికి సూచించారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు.. వాటికి అవసరమైన మందుల్ని ఇప్పుడే అందుబాటులో ఉంచాలని వైద్యుల్ని ఆదేశించారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులపై ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్యలు లేకుండా ప్రధాన వైద్యులు సమన్వయం చేసుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. రోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, వారికి మెరుగైన వైద్యసేవలు అందించాల్సిన బాద్యత వైద్యులదేనని ప్రత్తిపాటి తెలిపారు. ఆసుపత్రి పరిశీలనకు వెళ్లిన మాజీమంత్రి వెంట మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మధన్ మోహన్, మురకొండ మల్లిబాబు, గట్టినేని రమేష్, మారెళ్ళ ఇందిరా ఆసుపత్రి కమిటీ సభ్యులు తదితరులున్నారు.
