TEJA NEWS

క్రీడలను ప్రోత్సహించేందుకే వేసవి శిక్షణ శిబిరాలు

సూర్యపేట జిల్లా : క్రీడారంగాన్ని ప్రోత్సహించేందుకే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు దైద పాపయ్య అన్నారు. బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ అనే హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో, సూర్యాపేట జిల్లా యువజన క్రీడల సమైక్య ఆధ్వర్యంలో సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వాలీబాల్ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ మే 1 నుండి జూన్ 6వ తేదీ వరకు పాఠశాల మైదానంలో వాలీబాల్ శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామంలోని యువతి,యువకులకు వాలీబాల్ క్రీడలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నెలరోజుల పాటు శిక్షణనిస్తూ క్రీడలో మెలుకువు అందిస్తామన్నారు. ఈ శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పీజికల్ డైరెక్టర్ కిరణ్ కుమార్, ఉపాధ్యాయిని,ఉపాద్యాయులు, గ్రామ యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.