TEJA NEWS

పిల్లల్లో మానసిక దృఢత్వం, పరిపక్వతకు వేసవి శిక్షణ శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయి: బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

దుండిగల్ మున్సిపాలిటీ పరిధి డి.పోచంపల్లిలోని క్రికెట్ స్టేడియంలో మేడ్చల్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మే 1 నుంచి జూన్ 6 వరకు బాక్సింగ్ కోచ్ లక్ష్మణ్ సారథ్యంలో ఏర్పాటుచేసిన “బాక్సింగ్ కోచింగ్ వేసవి శిక్షణ శిబిరానికి” బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. పిల్లలు మొబైల్ ఫోన్లకు పరిమితం కాకుండా మానసిక దృఢత్వాన్ని, మనోధైర్యాన్ని పెంపొందించడంలో వేసవి శిక్షణ శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కుత్బుల్లాపూర్ లో బాక్సింగ్ క్రీడకు అధ్యుడు రాములు గారని వారి ఆధ్వర్యంలో వాళ్ల అబ్బాయి సుధీర్ తో పాటు అనేక మంది శిక్షణ పొంది మంచి స్థాయిలో స్థిరపడ్డారని అన్నారు. మీరు కూడా బాక్సింగ్ ను కేవలం వేసవి శిబిరాల్లోనే కాకుండా ఒక క్రీడగా ఎంచుకొని తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో సుధీర్, శ్రీధర్ గౌడ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.