TEJA NEWS

సుంకిరెడ్డి ఉచిత కంటి వైద్య శిభిరం సేవలు ఆరవ రోజుకు చేరుకున్నాయి…

ఆరు(6)రోజులుగా నిర్విరామ సేవలు,
రేపటితో ముగియనున్న కంటి పరీక్షల నిర్వహణ..
ఆదివారం వరకు కొనసాగనున్న కంటి శుక్లాల ఆపరేషన్లు.
మూడు రోజుగా విజయవంతంగా 79 మంది కంటి శుక్లాల పేషెంట్లకు సర్జరీలు పూర్తి.
1100 మందికి పైగా కంటి శిబిరాన్ని సందర్శించగా.._
_• 700 కి పైగా కంటి పరీక్షల నిర్వహణ,
450 కి పైగా ఉచిత కంటి అద్దాల పంపిణి,

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని సి కె ఆర్ ఫంక్షన్ హాల్లో,
ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర నేత్రాలయ వారిచే
ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,
టాస్క్ సి ఓ ఓ,సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేషంగా తరలివచ్చిన కల్వకుర్తి మరియు పరిసర ప్రాంతాల ప్రజలు,ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ…
నియోజకవర్గ వ్యాప్తంగా సంపూర్ణంగా అంధత్వ నిర్మూలనకై కృషిచేస్తున్నామని,నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని,ప్రస్తుతం కల్వకుర్తి పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత శిభిరం సేవలు పెద్ద ఎత్తున పేద ప్రజలకు చేరువైతున్నాయని,ఇప్పటివరకు ఆరు రోజులుగా 5000మందికి పైగా శిబిరాన్ని సందర్శించగా,వారిలో 2600 మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు,నిర్వహించామని,వాటిలో 170 మంది పేషెంట్లను కంటి శుక్లాల సర్జరీకి ఎంపిక చేశామని,వీరిలో 79 మంది పేషెంట్లకు విజయవంతంగా సర్జరీలు పూర్తి చేశామని, ఆరు రోజులుగా 2000 కి పైగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశామని,తెలియజేస్తూ,రేపటితో ముగియనున్న కంటి పరీక్షల సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు…
ఈ కార్యక్రమంలో…
ఐక్యత ఫౌండేషన్ సభ్యులు శ్రీరాములు,గణేష్,రఘు,యాదయ్య,శ్రీపతి,శేఖర్,శ్రీను, నాగిళ్ల శివ, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.