
సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన సూర్యాపేట నియోజకవర్గ కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ 306 మంది లబ్ది దారులకు ₹ 3,06,35,496/- రూపాయల విలువగల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తో పాటు కలిసి ముఖయఅతిథిలుగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మరియు సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సంద్భంగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ… పేదింటి ఆడబిడ్డ పెళ్లికి అయ్యే ఖర్చులను భరించలేక పేదలు అప్పుల పాలవుతున్నారని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల పెండ్లి అయిన సంవత్సరం లోపు లక్ష రూపాయల ఆర్దిక సహాయం అందజేస్తుందని అన్నారు.
- సూర్యాపేట నియోజకవర్గం లో మూడు కోట్ల రూపాయలు ఈ పధకం ద్వారా ఇవ్వడం జరిగిందని అన్నారు. మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పధకాలు అమలు చేస్తుందని తెలిపారు.
- ఆర్టీసి బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ, ఉచితంగా విద్యుత్ సరఫరా, అర్హులైన వారికి రేషన్ కార్డు లు ఇవ్వడంతో పాటు సన్నబియ్యం ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు.
- రాష్ట్ర ప్రభుత్వం ఆర్దిక పరిస్ధితి బాగాలేదని, అయినప్పటికీ ఎన్నికలలో హామి ఇచ్చిన విధంగా లక్ష రూపాయల సహాయంతో పాటు తులం బంగారం కూడ ఇస్తామని అన్నారు.
- గర్బిణి స్త్రీలు అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా లభించే వ పరిక్షలు చేయించుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి బిడ్డను కనాలని అన్నారు.
- జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన కార్యక్రమం లో పెద్దఎత్తున పాల్గొన్న మహిళలకు, కార్యక్రమం నిర్వహించిన జిల్లా కలెక్టర్ కు తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ధన్యవాదములు తెలిపారు…!!
ఈ కార్యక్రమంలో RDO వేణుమాధవ్ , తహసీల్దారు శ్యామ్ సుందర్ రెడ్డి , ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు…!!
