Spread the love

పేట టీట్కో గృహాలలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్ కార్యక్రమం

చిలకలూరిపేట: ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా ఈ శనివారం టీట్కో గృహాలలో టీట్కో డి ఈ సేతు బాబు, మున్సిపల్ ఏఈచల్లా శ్రీనివాసరావు, సిబ్బందితో కలిసి పరిసరాలు శుభ్రపరిచారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రజలతో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలంతా శుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యకరమైన జీవితం గడపాలని వీలైతే ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మొక్కలు పెంచే విధంగా చూసుకోవాలని తెలిపారు.