
ఈత సరదా.. విద్యార్థి మృతి
ఈత సరదా ఒక బాలుడి ప్రాణం తీసిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ఇలా ఉన్నాయి.. భూత్పూర్ మండలం అన్న సాగర్ గ్రామానికి చెందిన పద్మ వెంకటేష్ ల కుమారుడు సన్నీ (7) అనే ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి వేసవి సెలవులు ఉండడంతో బంధువుల గ్రామమైన వెంకటాయపల్లి గ్రామానికి వచ్చాడు. ఈత నేర్చుకునేందుకు తన బాబాయ్ తో కలిసి దేవరకద్ర పట్టణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ కు వచ్చాడు. సన్నీ ఈత కొడుతున్న సమయంలో లోపలికి నీరు వెళ్లడంతో ఊపిరి ఆడక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అస్వస్థతకు గురైన బాలుడిని చికిత్స నిమిత్తం 108లో దేవరకద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నూరు అయ్యారు. ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
