వైఎస్ఆర్ సీపీకి ఎన్నికల సంఘం షాక్! ఆ పథకాల నిధుల విడుదలకు ఈసీ బ్రేక్

వైఎస్ఆర్ సీపీకి ఎన్నికల సంఘం షాక్! ఆ పథకాల నిధుల విడుదలకు ఈసీ బ్రేక్

వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు ప్రతి నెల విడుదల చేస్తున్న సంక్షేమ పథకాల నిధుల విడుదల కోసం ఈసారి కూడా ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది. అందుకు నిరాకరించింది. AP: ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అమలులో ఉన్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి నిధుల విడుదలకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు, సార్వత్రిక ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. నోటిఫికేషన్ విడుదల కాగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున నిధుల విడుదలకు…

ఈసీ అలర్ట్ … ఓటర్లూ ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

ఈసీ అలర్ట్ … ఓటర్లూ ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

తెలుగు రాష్ట్రాల్లో మే 13న అంటే పోలింగ్ నాటికి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికోసం EC.. ఓట‌ర్ల‌కు కొన్ని సూచ‌న‌లు జారీచేశారు. ఉదయం పోలింగ్ ప్రారంభంకాగానే ఓటు హక్కు వినియోగించుకోండి. ఉదయం ఓటేయడం కుదరకుంటే సాయంత్రం సమయంలో ఓటు వేయడానికి వెళ్లండి. మధ్యాహ్న సమయంలో ఓటు వేయడానికి బ‌య‌ట‌కు వెళ్తే కూలింగ్ గ్లాసెస్ ఉపయోగించాలి. మహిళలు ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని వెళితే మంచిది. ఇంట్లోనే నీరు తాగి బయలుదేరాలని సూచించారు.

వైసీపీ అభ్యర్థికి బిగ్ షాక్.. ఈసీ కీలక ఆదేశాలు..

వైసీపీ అభ్యర్థికి బిగ్ షాక్.. ఈసీ కీలక ఆదేశాలు..

పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణకు బిగ్ షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘం. అంబటి మురళీకృష్ణపై కేసు నమోదైంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీన ఆదేశించారు. ఈ నెల 13వ తేదీన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ పొన్నూరు పట్టణంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాపై తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ…

షర్మిలకు ఈసీ అధికారులు నోటీసులు

షర్మిలకు ఈసీ అధికారులు నోటీసులు

కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు ఈసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో వివేకానంద రెడ్డి హత్యను ప్రస్తావించారు. అలాగే అవినాష్ రెడ్డి, వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మల్లాది విష్ణు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును పరిశీలించిన అధికారులు వైఎస్ షర్మిలకు నోటీసులు పంపి షాక్ ఇచ్చారు. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని, గడువు దాటితే చర్యలు తప్పవని కూడా సూచించారు.

రాములవారి కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి రాకకు నిరాకరణ ఈసీ

రాములవారి కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి రాకకు నిరాకరణ ఈసీ

ముఖ్యమంత్రి రాకను, ఎన్నికల కమిషన్ నిరాకరించినట్లుసమాచారం. పార్లమెంట్ ఎన్నికల కోడ్, భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రాకను, ఎన్నికల కమిషన్ నిరాకరించినట్లు సమాచారం.ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు రాక అనుమానమే. జరగనున్న కళ్యాణానికి, మంత్రులు ఎవరు..! హాజరవుతారు అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.శ్రీ సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు దంపతులు.

భద్రాచలం సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి నిరాకరణ

భద్రాచలం సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి నిరాకరణ

ప్ర‌త్య‌క్ష ప్ర‌సారానికి అనుమ‌తి కోరుతూ మ‌రోసారి సీఈఓకు లేఖ రాసిన మంత్రి కొండా సురేఖ ఆల‌య విశిష్ట‌త, సంప్ర‌దాయాలు వివ‌రిస్తూ ఈసీకి మంత్రి లేఖ క‌ల్యాణ మ‌హోత్స‌వం ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌డం గ‌త 40 ఏళ్లుగా జరుగుతోంద‌న్న మంత్రి ఈ నెల 17వ తేదీన శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా భ‌ద్రాచ‌లంలో నిర్వ‌హించే భ‌ద్రాద్రి సీతారాముల కల్యాణం ప్ర‌త్య‌క్ష ప్ర‌సారానికి తాజాగా ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఈసీ) అనుమ‌తి నిరాక‌రించింది. దీంతో మంత్రి కొండా సురేఖ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారానికి అనుమ‌తి కోరుతూ…

నేడు ఎన్నికల తేదీలను ప్రకటించనున్న ఈసీ

నేడు ఎన్నికల తేదీలను ప్రకటించనున్న ఈసీ

న్యూఢిల్లీ :మార్చి 16సార్వత్రిక ఎన్నికల నగారా నేడు శనివారం మోగనుంది. మధ్యాహ్నం గం. 3.00 కు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల తేదీలను ప్రకటించేందుకు సమాయత్తమైంది. ఈ మేరకు శుక్రవారం ఈసీ ఒక ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం ఉద యం కొత్తగా నియమి తులైన కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్ పదవీ బాధ్యతలు చేపట్టారు. కొద్ది రోజులుగా ఖాళీగా ఉన్న ఈ పదవులను గురువారం ప్రధాన మంత్రి…

నకిలీ వార్తలపై ఈసీ కన్నెర్ర.. ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు, హద్దుమీరితే

నకిలీ వార్తలపై ఈసీ కన్నెర్ర.. ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు, హద్దుమీరితే

2024 లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ సందర్భంగా దేశంలో ఎన్నికలు, ఓటర్లకు సంబంధించిన వివరాలను సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలకు హెచ్చరికలు చేశారు సీఈసీ. సోషల్ మీడియాలో ప్రచారం చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. నకిలీ వార్తలు, దుష్ప్రచారం చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని రాజీవ్ కుమార్ హెచ్చరించారు. ఐటీ…

ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు: ఈసీ.

ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు: ఈసీ.

ఓటర్లకు ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆధార్ లేకపోయినా ఓటు వేయొచ్చని తేల్చిచెప్పింది. చెల్లుబాటయ్యే ఏ గుర్తింపు కార్డునైనా అనుమతిస్తామని పేర్కొంది. ఆధార్ లేనివారిని ఓటు వేయకుండా అడ్డుకోమని తెలిపింది. కాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కుపై అవగాహన పెంచేందుకు ఈసీ ప్రయత్నిస్తోంది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ఎన్నికల ఏర్పాట్లపై వేగం పెంచిన ఈసీ

ఎన్నికల ఏర్పాట్లపై వేగం పెంచిన ఈసీ

ఎన్నికల ఏర్పాట్లపై వేగం పెంచిన ఈసీ.. జిల్లా ఉన్నతాధికారులకు సీఈవో కీలక ఆదేశాలు ఆంధ్రప్రదేశ్‎లో సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండటంతో ఎన్నికల కమిషన్ అధికారులు వేగం పెంచారు. దేశమంతా లోక్ సభ ఎన్నికలు జరుగుంతుండటంతో పాటు ఆంధ్రప్రదేశ్‎లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. 2014లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సమయం, ఎన్నికలు జరిగిన సమయాన్ని ప్రాధమికంగా పరిగణనలోకి తీసుకుని ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లపై ముందుకెళ్తున్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు ఇతర ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు…

ఆ పార్టీలకు ఈసీ హెచ్చరిక

ఆ పార్టీలకు ఈసీ హెచ్చరిక

ఎన్నికల ప్రచారంలో చిన్నారులను ఎత్తుకున్నారో.. : ఆ పార్టీలకు ఈసీ హెచ్చరిక Lok Sabha 2024: దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. మార్చిలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ…..