ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పుఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ తీర్పు రానుంది. గతంలో ట్రయల్ కోర్టు బెయిల్ ను తిరస్కరించి కొట్టివేయగా.. ఆమె ఢిళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇక ఇవాళ మధ్యాహ్నం న్యాయమూర్తి స్వర్ణకాంతశర్మ తీర్పు వెలువరిచనున్నారు. దీంతో కవితకు బెయిల్ లభిస్తుందా..? లేదా అనేది ఉత్కంఠ నెలకొంది.

కేజ్రీవాల్ బెయిల్‌పై తీర్పు రిజర్వ్

కేజ్రీవాల్ బెయిల్‌పై తీర్పు రిజర్వ్

Judgment reserved on Kejriwal’s bail కేజ్రీవాల్ బెయిల్‌పై తీర్పు రిజర్వ్ లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును రౌజ్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. బెయిల్ పిటిషన్‌తో పాటు మెడికల్ బోర్డు ఎదుట తన వైద్య పరీక్షల సమయంలో తనతో పాటు భార్య హాజరు కావడానికి అనుమతి కోరుతూ చేసిన దరఖాస్తుపై తీర్పును సైతం కోర్టు రిజర్వ్ చేసింది.

వీవీ ప్యాట్ల పై సుప్రీం కోర్టు తీర్పు విడుదల

వీవీ ప్యాట్ల పై సుప్రీం కోర్టు తీర్పు విడుదల

న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్లను అన్నింటిని కొట్టివేస్తున్నట్లు సుప్రీం స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 24న వాదనల నేపథ్యంలో … సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని పేర్కొంటూ తీర్పు రిజర్వ్‌ చేసింది. తాజాగా సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది

ఢిల్లీ : మనీష్ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌..

ఢిల్లీ : మనీష్ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌..

ఈ నెల 30న తీర్పు వెల్లడించనున్న రౌస్‌ అవెన్యూ కోర్టు.. లిక్కర్ పాలసీ సీబీఐ, ఈడీ కేసుల్లో సిసోడియా బెయిల్‌ పిటిషన్.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతి కోరిన సిసోడియా.

జనసేనకు గాజు గ్లాసు గుర్తుపై నేడు కీలక తీర్పు..

జనసేనకు గాజు గ్లాసు గుర్తుపై నేడు కీలక తీర్పు..

జనసేనకు గాజు గ్లాసు సింబల్ కేటాయింపుపై నేడు హైకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గ్లాసు గుర్తు కోసం తాము తొలుత దరఖాస్తు చేసుకుంటే ఈసీ నిబంధనలకు విరుద్ధంగా జనసేనకు ఇచ్చిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే విచారణ చేసిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తమకే ఆ సింబల్ దక్కుతుందని జనసేన ధీమాగా ఉంది.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పిటీషన్ పై హైకోర్ట్ సంచలన తీర్పు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పిటీషన్ పై హైకోర్ట్ సంచలన తీర్పు

దాశోజు శ్రవణ్, కుర్ర సత్య నారాయణల ఎంపికను గవర్నర్ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్దమన్న హైకోర్టు. ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ నియామకం కొట్టివేత. కొత్తగా ఎమ్మెల్సీ ల నియామకం ప్రక్రియ చేపట్టాలని ఆదేశం…

నిరుద్యోగి భర్తకు నెలనెలా భరణం చెల్లించాల్సిందే.. ఇండోర్ కోర్టు కీలక తీర్పు

నిరుద్యోగి భర్తకు నెలనెలా భరణం చెల్లించాల్సిందే.. ఇండోర్ కోర్టు కీలక తీర్పు

ప్రతినెల రూ. 5000 చెల్లించాలంటూ భార్యకు ఆదేశం భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని భార్య ఆరోపణ ఆమే తనను వేధించిందంటూ కోర్టుకెక్కిన భర్త ఆమెకు తాను చదువును త్యాగం చేసి నిరుద్యోగిగా మిగిలిపోయానని భర్త ఆవేదన ఇరు పక్షాల వాదనల అనంతరం భార్య వాదనలకు, ఆధారాలకు పొంతన లేదని భావించిన తర్వాత భర్తకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది.

ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ స్కీమ్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ స్కీమ్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఏకగ్రీవ తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎలక్ట్రోరల్ బాండ్స్‌ రాజ్యాంగ విరుద్ధం: సుప్రీంకోర్టు నల్లధనం అరికట్టేందుకు సమాచార హక్కును ఉల్లంఘించడం సమంజసం కాదు రాజకీయ పార్టీలకు విరాళాలు క్విడ్‌ ప్రోకోకు దారి తీయవచ్చు