
హెచ్ సి యు భూములకు బదులు ప్రత్యామ్నాయంగా గాజులరామారం భూములను తీసుకోండి.
సిఎం రేవంత్ రెడ్డి గారికి సిపిఐ సూచన.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి చెందిన 400ఎకరాల భూములను అభివృధి నిమ్మితం టిజీఐ ఐ సి కి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించాడన్ని అన్ని ప్రధానప్రతిపక్షాలు,విద్యార్ధి సంఘాలు,మేధావులు,పర్యావరణ వేత్తలు అభ్యంతరం తెలుపుతుంటే మొండిగా పోవడం ప్రజా పాలన అనిపించుకోదని అది ప్రజల్లో వ్యతిరేకత భావం ఏర్పడుతుందని కావున సిఎం గారు ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకొని ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని అన్నారు.
గచ్చిబౌలి,హైదరాబాద్ యూనివర్సిటీ ప్రాంతాలు ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలని అభివృద్ధి ఒక్క ప్రాంతంలోనే కేంద్రీకృతం కాకుండా నగర వ్యాప్తంగా చేస్తామని సిఎం హామీలు ఇచ్చి నేడు ఆలా చెయ్యకుండా ఒక ప్రాంతానికే పరిమితం కావడం తగదని,కావున సిఎం రేవంత్ రెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అది నేడు కబ్జాకారుల చేతిలో కబ్జాలకు గురై ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందని, కావున సీఎం రేవంత్ రెడ్డి గాజులరామారంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని అభివృద్ధి పరచాలని సిపిఐ నియోజకవర్గ సమితి కార్యదర్శి ఉమామహేష్ డిమాండ్ చేశారు. అదేవిధంగా స్థానిక నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులందరూ కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి కి గాజులరామారం లో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల పైన అవగాహన తీసుకువచ్చి ఇక్కడి ప్రభుత్వ భూములలో పెట్టుబడులు పెట్టేలా చర్యలు తీసుకోవాలని అలా పెట్టుబడులు గాజులరామారం కి వస్తే కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు అన్ని విధాలుగా లాభ పడతారని అన్నారు.
