Spread the love

బహిరంగ మూత్రవిసర్జన జరకుండా చర్యలు చేపట్టండి.

కమిషనర్ ఎన్.మౌర్య

నగరంలో బహిరంగ మూత్ర విసర్జన జరగకుండా, జన సమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలోని చిన్న బజారు వీధి, చింతకాయల వీధి, రామచంద్ర పుష్కరిణి, పల్లివీధి, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో శనివారం కార్పొరేటర్లు నరసింహాచారి, రేవతి, హెల్త్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో కలసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో బహిరంగ మూత్ర విసర్జన జరగకుండా తగినన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామని అన్నారు. ముఖ్యంగా నగరంలో రద్దీ ఎక్కువగా ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నామని అన్నారు. అలాగే స్వచ్ఛ సర్వేక్షన్ లో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు ప్రజల సహకారం అవసరం అన్నారు.

నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు అందరూ సహకరించాలని అన్నారు. పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పలు చోట్ల మరుగుదొడ్లను పరిశీలించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ గోమతి, డి.ఈ.మధు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసిపి బాలాజి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, సర్వేయర్ కోటేశ్వర రావు, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు ఉన్నారు.