Spread the love

కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య?

కర్నూలు జిల్లా:
కర్నూలు జిల్లాలో పాత పగలు భగ్గుమన్నాయి. తెలుగు దేశం పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యా డు. 30వ వార్డు కార్పొరేటర్ జయరాముడు తండ్రి టిడిపి నేత సంజన్నను గుర్తు తెలియని దుండ గులు హతమార్చారు.

ఈ ఘటన రాత్రి నగరంలోని షరీఫ్ నగర్ లో చోటుచేసుకుంది. దీంతో కాలనీలో కలకలం రేగింది. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో సంజన్న నివసిస్తున్న షరీఫ్ నగర్‌లోని గూడేకల్లు అల్లి పీర స్వామి మందిరానికి ప్రార్థన చేసుకోవడం కోసం వెళ్లేవాడు.

బైక్ మందిరం ముందర ఆపి లోపలికి వెళ్తుండగా హఠాత్తుగా కొంతమంది గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా వేటకొడవళ్లు, కత్తులతో దాడి చేశారు. దుండగులు పథకం ప్రకారం ముందస్తుగానే ప్రణాళిక రచించి ఈ దాడికి తెగబడ్డారు.

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థ లానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య వెనక పాత కక్షలు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంజన భార్య సిపిఎం నుంచి గతంలో కార్పొరేటర్ గా గెలుపొందారు. సంజన్న కుమారుడు జయరాం 30వ డివిజన్ వైసీపీ కార్పొ రేటర్ విజయం సాధించా రు. అసెంబ్లీ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరింది సంజన్న కుటుంబం. 30వ డివిజ న్‌లో అధిపత్య పోరులో భాగంగా ప్రత్యర్థులు హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

చాలా ఏళ్లుగా వడ్డె రామాం జనేయులు, సంజన్న కుటుంబాల మధ్య ఆధి పత్య పోరు కొనసాగు తోంది. ఈ నేపథ్యంలోనే హత్యకు ఒడిగట్టి ఉండవ చ్చంటున్నారు స్థానికులు. కాగా మృతదేహాన్ని కర్నూ లు జిజిహెచ్ కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.