TEJA NEWS

పులివెందులపై టిడిపి స్పెషల్ ఫోకస్?

అమరావతి:
ప్రతిపక్ష నేత సొంత జిల్లాలో పసుపు జెండాలు రెపరెపలాడాల్సిందే..విపక్ష నేత సొంత ఇలాకాలో మనబలమేంటో చూపించా ల్సిందే. ఆపోజిషన్ లీడర్ నట్టింట్లో సైకిల్ పవర్ ఏంటో సత్తా చాటాల్సిందే. ఇదీ టీడీపీ అధినేత అసలు వ్యూహమా? కడప మహానాడులో బాబు బిగ్ గీసిన స్కెచ్ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయా? ఇంతకీ కూటమి అధి నేత..విపక్ష నేత ఇలాకాలో వేసిన పొలిటికల్ స్కెచ్చేం టి? మహానాడు మ్యాని యలో ఏం జరగబోతోంది?

వైయస్సార్సీపి పార్టీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడప గడపలో అడుగుపెట్టి తన సత్తా చాటిన టీడీపీ..ఇప్పుడు ఏకంగా తన నియోజకవర్గం పులివెందులలో అడుగు పెట్టి ఆ పార్టీ పునాదులు లేకుండా చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రాజ కీయ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారట.

దీంతో కడప జిల్లా రాజకీ యాలు ఒక్కసారిగా వేడెక్కాయన్న టాక్ రాజకీయవర్గాల్లో విన్పిస్తోం ది.జగన్ సొంత నియోజ కవర్గం పులివెందులలో ఇప్పుడు టీడీపీ రీసౌండ్ చేస్తుందన్న వార్తలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిగ్గా మారాయి. ఎందుకంటే వైఎస్సార్ అంటే పులివెం దుల, పులివెందుల అంటే వైఎస్సార్ అన్న పేరు నేటికీ అక్కడ కొనసాగుతోంది.

కానీ తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా మారు తున్నాయనే చర్చ జిల్లా రాజకీయాల్లో నడుస్తోంది. 4 దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీ కంట్రోల్ లో నడుస్తున్న పులివెందులలో ఇప్పుడు పరిస్థితి కాస్త చేంజ్ కనబడుతోంది.

రాష్ట్రంలో ఏ పార్టీ అధికా రంలో ఉన్నా పులివెందుల ప్రజలు మాత్రం వైఎస్ ఫ్యామిలీ వెంటే నడిచారు. వైఎస్ వివేకానంద రెడ్డి మొదలుకొని వైఎస్సార్, వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి కేవలం వైఎస్ ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్న జనం ఇప్పుడు ఒక్కసారిగా మార్పుకోసం చూస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. వైఎస్ వివేకా మృతి తర్వాత పులివెందు లలో చాలా మార్పులు వచ్చాయట. ఆయన మరణం తర్వాత వైసీపీ ఏపీలో అధికారాన్ని కోల్పోయింది.

వైఎస్ వివేక మరణం తర్వాత కడప జిల్లాలోనే కాదు..జగన్ సొంత నియో జకవర్గం పులివెందుల ప్రజల్లో కూడా మార్పు మొదలైందట. మార్పు కావాలంటూ కోరుకుంటున్న జనం ఆ దిశగా అడుగులు వేస్తున్నారట. సరిగ్గా ఇదే అవకాశాన్ని అందిపుచ్చు కున్న కూటమి పులివెందు లపై స్పెషల్ ఫోకస్ పెంచిందట. కూటమి సర్కార్..

జగన్ సొంత ఇలాకాలో ఫ్యాన్ పార్టీని దెబ్బకొట్టి సైకిల్ పవర్ ఏంటో చూపించాలన్న ఆలోచనతో టీడీపీ అధినేత చంద్రబాబు సరికొత్త పొలిటికల్ స్కెచ్ వేశారని సమాచారం. 2019 ఎన్నికల్లో అధికా రంలోకి వచ్చిన జగన్…టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో తన పవర్ చూపించాడు.

ఇప్పుడు చంద్రబాబు కూడా అలాంటి మైండ్ గేమ్ నే మొదలు పెట్టి పులివెం దులపై ఫోకస్ పెట్టారట. ఇప్పటికే పులివెందుల నుంచి ఎమ్మెల్సీని గెలిపిం చుకొని ఉపుమీదున్న పార్టీలోకి మరింత మంది లీడర్లను కడప వేదికగా ఆహ్వానించడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పులివెందుల మున్సిపాలిటీలో ఇద్దరు కౌన్సిలర్లు పార్టీ మార గా..మరికొంతమంది కూడా అదే దారిలో ఉన్నట్లు టాక్ విన్పిస్తోంది.