
టెట్ అర్హతతో రైల్వేలో టీచర్ ఉద్యోగాలు!
హైదరాబాద్
రైల్వే శాఖలోని ఆర్‌ఆర్‌బీ మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు దరఖాస్తు గడువు రేపటితో ముగు స్తుండటంతో తాజాగా కీలక ప్రకటన జారీ చేసింది.
ఈ క్రమంలో రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (RRB) దరఖా స్తు గడువు పెంపొందిస్తూ తాజా ప్రకటన జారీ చేసింది మేరకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 16, 2025వ తేదీ వరకు పొడిగించింది. దీంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులకు మరో అవకాశం కల్పించింది..
చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆర్‌ఆర్‌బీ అభ్యర్ధులకు సూచించింది. ఈ నోటిఫికే షన్ ద్వారా పోస్ట్ గ్రాడ్యు యేట్ టీచర్లు, సైంటిఫిక్ సూపర్‌వైజర్, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, లైబ్రేరియన్, ప్రైమరీ రైల్వే టీచర్, అసిస్టెంట్ టీచర్ తదితర పోస్టులు మొత్తం 1036 వరకు భర్తీ చేయనున్నారు.
అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 16, 2025వ తేదీ రాత్రి 11.59 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల సంఖ్య : 187
సైంటిఫిక్ సూపర్‌వైజర్ పోస్టుల సంఖ్య: 03
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు పోస్టుల సంఖ్య: 338
చీఫ్ లా అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 54
పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల సంఖ్య: 20
ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల సంఖ్య: 18
సైంటిఫిక్ అసిస్టెంట్/ ట్రైనింగ్ పోస్టుల సంఖ్య: 02
జూనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టుల సంఖ్య: 130
సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్ పోస్టుల సంఖ్య: 03
స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల సంఖ్య: 59
మ్యూజిక్ టీచర్ పోస్టుల సంఖ్య: 10
ప్రైమరీ రైల్వే టీచర్ పోస్టుల సంఖ్య: 03
లైబ్రేరియన్ పోస్టుల సంఖ్య: 188
అసిస్టెంట్ టీచర్ పోస్టుల సంఖ్య: 02
