
అజ్ఞాన చీకట్లను పార దోలి విజ్ఞాన జ్యోతులను వెలిగించేదే గురువు
కవులు కళాకారులను సన్మానించిన బిజెపి
వనపర్తి
గురు పౌర్ణమిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో నిష్టాతులైన పలువురు కవులను కళాకారులను జిల్లా కేంద్రంలో శాలువాలు కప్పి సన్మానించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ సృష్టిలో తల్లిదండ్రుల తర్వాత గురువుదే తర్వాతి స్థానమని ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో కలలో, రంగంలో నిష్ఠాత్తులు గా పేరందుతారని ఆ రంగంలో వారికి తప్పనిసరిగా ఎవరో ఒకరు గురువు ఉంటారని అందుకే గురువు లేని విద్య గుడ్డిదని అందుకే అజ్ఞాన చీకట్లను పారదోలి విజ్ఞాన జ్యోతులను వెలిగించే వ్యక్తి గురువని ప్రపంచంలోగురువుకున్న స్థానాన్ని ప్రశంసించారు ప్రస్తుతం వివిధ రంగాల్లో వారి వారి రంగాల్లో ఎంతోమందికిశిక్షణలు ఇస్తూ ఈ సమాజానికి తమ వంతు సేవలందిస్తున్న వారిని క్రోడీకరించి వారందరినీ సన్మానించి గౌరవించుకోవడం జరిగిందని తెలిపారు. నీరజ శ్రీదేవి ఓంకార్ డాక్టర్ నాయకంటి నరసింహ శర్మ డాక్టర్ అనంతప్ప జిటి కృష్ణ డప్పు స్వామి శివలింగం శివకుమార్ కరాటే శేఖర్ తదితరు లు సన్మానింపబడిన వారిలో ఉన్నారు. మున్నూరు రవీందర్ సబిరెడ్డివెంకటరెడ్డి డి నారాయణ సీతారాములు రామన్న వెంకటేశ్వర రెడ్డి బచ్చు రాము పెద్దిరాజు తదితరులు సన్మానించిన వారిలో ఉన్నారు
