
తెలంగాణ ప్రభుత్వం నుండి బీరప్ప మల్టీ పర్పస్ హాల్ నిర్మాణానికి రూ.1 కోటి నిధులు మంజూరు
తెలంగాణ ప్రభుత్వం నుండి బీరప్ప మల్టీ పర్పస్ హాల్ నిర్మాణానికి రూ.1 కోటి నిధులు, * మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు * ద్వారా, *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి * సహకారంతో మంజూరు కావడం పట్ల, ఈరోజు బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు కుర్మ సంఘ కమిటీ సభ్యులు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కె.ఎం. గౌరీష్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కుర్మ సంఘ అధ్యక్షులు బట్ట బాలకృష్ణ, సూరారం విలేజ్ చైర్మన్ బట్ట నర్సింహా, ఆలయ అధ్యక్షులు బాలయ్య, పెంటయ్య, సెల్వియోజి సత్తయ్య, చిన్న సత్తయ్య, బాలరాజ్, కుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.