TEJA NEWS

ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ గవర్నర్ ఆమోదం

తెలంగాణ రాష్ట్రం : ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు.

ఎస్సీల్లోని 59 ఉపకులాల్ని మూడు గ్రూపులుగా విభజించి, 15శాతం రిజర్వేషన్లు కల్పించేలా రూపొందించిన ఈ బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే గెజిట్ రానుంది.

దీంతో ఇకపై విడుదలయ్యే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, విద్యా సంస్థల ప్రవేశాల్లో వర్గీకరణ అమలు కానుంది.

కాగా ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా మాదిగలు పోరాడుతున్నారు.