
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతనంగా చేపట్టిన సన్నబియ్యం పథకంలో భాగంగా కూకట్పల్లి డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ కాలనీ లో పేదవారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం అందజేసే కార్యక్రమాన్ని బాలానగర్ ASO కళ్యాణ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం తో ప్రతి “పేదవారికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం జరిగినది అని, రాష్ట్రంలోని 3 కోట్ల 10 లక్షల మందికి ఆరు కిలోల సన్నబియ్యం అందచేయడం జరుగుతుంది అని. అందుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుంది. ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకం అని ,ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకం. పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా లబ్ధిదారులకు ఉగాది పర్వదినం నుండి ప్రారంభించడం జరిగినది అని, ప్రభుత్వం రేషన్ దుకాణం ద్వారా పంపిణీ చేస్తున్న ఫోర్టీ ఫైడ్ బియ్యం లో ఐరన్ ,విటమిన్ బీ12, మరియు ఫోలిక్ ఆసిడ్ లు ఉన్నవి అని, ఇవి స్త్రీలకు, గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు మరియు అందరికి ఆరోగ్యపరంగా మంచి పోషకాలు లభిస్తాయి. కావున ఫోర్టీ ఫైడ్ సన్న బియ్యం అందరూ తినండి ఆరోగ్యంగా ఉండండి అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
పేదలు దొడ్డు బియ్యం తినలేరు. పీడీఎస్ బియ్యాన్ని మిల్లర్లు, దళారులు సైక్లింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి పేదవారి ఇంట ప్రతిరోజూ పండుగ జరగాలన్న ఆలోచనతో, పేద వారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించడం జరిగినది అని. ఈ గడ్డ మీద నుంచి ప్రారంభించిన పథకాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా పకడ్బందీగా అమలు చేసి పేదవారికి అండగా ఉండటం జరుగుతుంది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
అర్హులైన నిజమైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందచేస్తాం అని , రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతరం ప్రక్రియ అని, రేషన్ బియ్యం అవసరం లేని వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మానవతా దృక్పథంతో తిరిగి ఇస్తే నాలుగు పేద కుటుంబాలకు అండగా నిలిచే వారు అవుతారు అని , రేషన్ బియ్యం దుర్వినియోగం కాకుండా నిజమైన లబ్ధిదారులకు అందేలా చూడలని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి,గణేష్ ముదిరాజ్, నాయి నేనీ చంద్రకాంత్ రావు, రాజు యాదవ్, హరినాథ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,MD ఇబ్రహీం, ఎల్లం నాయుడు, చంద్రమోహన్ సాగర్, ఎర్రలక్ష్మయ్య, నర్సయ్య,లింగయ్య ,తిరుపతి, నరేష్ మరియు కాలనీ వాసులు ,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
