TEJA NEWS

తెలంగాణా రాష్ట్రంలో ఏసిబి గట్టిగనే పని చేస్తుంది అనిపిస్తుంది..

మొదటి బంగారు కొండ
లంచం ₹25 వేలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డ అసిఫాబాద్ SI రాజ్యలక్ష్మి

రెండవ బంగారు కొండ
లంచం ₹18 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ నల్గొండ జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ & ఇన్చార్జ్ ఆఫ్ AD మిర్యాలగూడ సోమేశ్వర్.

మూడవ బంగారు కొండ
లంచం ₹20 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ TSRTC హుజురాబాద్ డిపో మేనేజర్ సామల శ్రీకాంత్

హుజురాబాద్‌‌ డిపో మేనేజర్‌‌ ముచ్చటైతే మంచిగుంది.. ఏదో తప్పు దొరకబట్టి.. ఓ ఛార్జీ మోమో ఇవ్వాలే.. ఆ మోమో తీయ్యాలంటే ఇన్ని పైసలు దంచాలే..

గీ చార్జీ మోమోల ఇచ్చుడు.. తీసుడు దందా ఏయే శాఖల్లో ఉందో ఏసీబి అధికారులు దృష్టి సారించాలే…

ఏది ఏమైన గుడ్‌‌ జాబ్‌‌ ఏసిబి.. ఒకే రోజు మూడు కేసులంటే మాములు విషయం కాదు.. ఈ భయంతో అధికారులు అవినితీని తగ్గించుకుంటే ప్రజలకు, సామాన్యులకు మేలు జరుగుతది.