TEJA NEWS

కార్యకర్తలే నడిపే ఏకైక పార్టీ తెలుగుదేశం

** కడప మహానాడు వేదికపై “శాప్” చైర్మన్ అనిమిని రవినాయుడు

కడప (తిరుపతి): దేశంలో అనేక పార్టీలు ఉన్నా… కొన్ని పార్టీలను వ్యవస్థలు నడుపుతున్నాయి…. కొన్ని పార్టీలను నాయకులు నడుపుతున్నారు…. కానీ కార్యకర్తలే నడిపే ఏకైక పార్టీ మాత్రం మన తెలుగుదేశం పార్టీ ఒక్కటేనని “శాప్ ” చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు.
తొలిరోజు మహానాడు కార్యక్రమంలో రవినాయుడు పాల్గొని ప్రసంగించారు. మహానాడు కార్యక్రమాలలో వాలంటీర్ గా పనిచేశానని, అయితే
ఈరోజు మహానాడు వేదికపై నిలబడేందుకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మంత్రి లోకేష్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. వైసీపీని బంగళాఖాతంలో కలిపిన మీ అందరికి శిరస్సు వంచి నమస్కారం తెలుపుతున్నానని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కార్యకర్తల సంక్షేమం కోసమే పని చేశారని గుర్తు చేశారు.


కార్యకర్తలకు బాధ వచ్చినా…ఇబ్బంది వచ్చినా…కన్నీళ్లు వచ్చినా నేనున్నానంటూ… అధినేత ఎప్పుడూ అండగా ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారని…. చంపబడ్డారని… వేధించబడ్డారని…. చివరకు ఊరు వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆవేదన చెందారు. కానీ మనపార్టీ అధినేత మాత్రం ఆరోజు….ఈరోజు ఎప్పుడూ అండగా నిలబడ్డారని చెప్పారు. ఆర్ధికంగా, సామాజికంగా విద్య, వైద్యం, అనేక విధాలుగా అండగా ఉంటూ.. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మన బిడ్డలను చదివిస్తూ అండగా నిలబడ్డారని వివరించారు.
మా చిత్తూరు జిల్లాలో ఒక మాట ఉంది….. నారా చంద్రబాబు నాయుడు చేతికి ఎముక లేదు..చేతికి ఎంత వస్తే అంతా కార్యకర్తలకు సాయం చేసి ఆదుకోవడమే ఆయనకు తెలుసు అనేది నిజం చేసి చూపుతున్న నేత అని కొనియాడారు. ఇక యువనేత నారా లోకేష్ కోటి సభ్యత్వాలు చేయించారని, యువగళం పాదయాత్రలో సార్ వెంట అడుగులో అడుగు వేశానని రవినాయుడు గుర్తు చేసుకున్నారు. ఆరోజు కష్టం చెప్పుకోవడానికి వచ్చిన కార్యకర్త, కుటుంబ సభ్యులకు, ప్రజలకు తన ఫోన్ నెంబర్ ఇచ్చారని తెలిపారు. దేశంలో ఏ నాయకుడు తన సొంత నెంబర్ ను ఇలా ఇవ్వరని , ఇవ్వలేదు…. కానీ లోకేష్ అన్న ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి ఏ కష్టం వచ్చినా నా నెంబర్ ఇచ్చి కాల్ చేయండని నెంబర్ ఇచ్చారని పేర్కొన్నారు.
ఏ మీటింగ్ కి వెళ్లినా ముందుగా కార్యకర్తల సంక్షేమం గురించి తెలుసుకునేవారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ లో అయినా, ఢిల్లీలో అయినా, అండమాన్ లో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా నాకు కష్టం ఉందని కార్యకర్త నుండి మెసెజ్ వస్తే 5 నిమిషాల్లో తన టీమ్ ను పురమాయించి 5 నిమిషాల్లో సమస్యను పరిష్కరిస్తున్న మన నారా లోకేష్ నాయకత్వం చిరకాలం ఉండాలని కామక్షించారు. 44 సంవత్సరాలుగా కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అండగా ఉన్నారని వెల్లడించారు.